Mon. Mar 9th, 2026

MLA K.P. Vivekananda : మైక్రోబయాలజీ గోల్డ్ మెడలిస్ట్‌కు బి.ఆర్.ఎస్.ఎల్. పి. విప్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద సహకారం

TRINETHRAM NEWS

Trinethram News : మైక్రోబయాలజీ డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించిన పేద విద్యార్థి శ్రీపతి ఉదయ్ కుమార్‌కు ఆస్ట్రేలియాలోని RMIT యూనివర్సిటీలో మైక్రోబయాలజీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే అవకాశం లభించింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు ఆటంకం ఏర్పడడంతో స్థానిక శాసనసభ్యులు, బి.ఆర్.ఎస్.ఎల్. పి. విప్ కె.పి. వివేకానంద ని ఆర్థిక సహాయం కోసం ఆశ్రయించారు.

విద్యార్థి అభ్యర్థనకు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ సభ్యులకు విషయం తెలియజేశారు. ఎమ్మెల్యే సిఫారసు కి స్పందించిన లయన్స్ క్లబ్ సభ్యులు సోమవారం ఉదయం రూ.1,30,000 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థికి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను సిఫారసు చేసిన మూడు రోజులలోనే విద్యార్థికి అండగా నిలిచేందుకు ముందుకు రావడం ఎంతో సంతోషదాయకమని, అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాగే పేద విద్యార్థులకు సహకారం అందించాలని లయన్స్ క్లబ్ సభ్యులను కోరారు. నియోజకవర్గంలో పేద విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను పూర్తి చేసుకునేందుకు తన వంతుగా ఎల్లప్పుడూ ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ అధ్యక్షులు ఆంజనేయులు, డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ విజయ్ కుమార్ శెట్టి, సీనియర్ సభ్యులు చల్లా శ్రీనివాస రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, కోలా వెంకటేష్, ముదిరాజ్ శ్రీనివాస్ రెడ్డి, నరసింహులు గౌడ్, బాలరాజు, ప్రవీణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Microbiology Gold Medalist MLA K.P. Vivekananda's Support..

Related Post

You cannot copy content of this page