Ramavat Ravindra Kumar : దేవరకొండ నియోజకవర్గ సోదర,సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 24 త్రినేత్రం న్యూస్. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని దేవరకొండ నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులకు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

క్రిస్మస్ అంటే ఏసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ,సహనం, కరుణ పూర్వక అనుబంధాలను మేలుకొలుపుతూ ఏసు బోధనలను ఆదరించే సందర్భం. ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి ఏసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుంది.

ఈ సందర్భంగా క్రైస్తవ సోదర,సోదరీమణులలో శాంతి, సామరస్యం విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాను. క్రైస్తవులంతా భక్తి, శ్రద్ధలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని క్రైస్తవ సోదర,సోదరీమణులను ఆకాంక్షిస్తున్నాను అని ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Merry Christmas to the brothers and sisters

You cannot copy content of this page

Scroll to Top