జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 27 at 5.50.03 PM

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసిన మహాదేవ పురం నుతన వెల్ఫేర్ సొసైటీ సభ్యులు…

ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ మహాదేవ పురం వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు పాలక వర్గం సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ కాలనీలలో సభ్యులంతా ఒక్క తాటిపై ఉండి పనిచేసినప్పుడు కాలనీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, మహాదేవ పురం వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు కే.వెంకట్ రెడ్డి, సలహాదారులు డి. నాగేశ్వర్ రావు, సీహెచ్. రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, ఎం. రంగారావు, ప్రధాన కార్యదర్శి డి. ప్రసాద్ బాబు, పి. రామచంద్రారెడ్డి, ఆర్. ప్రవీణ్ కుమార్, ఈ. ప్రభాకర్ రెడ్డి, సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page