WhatsApp Image 2023 12 27 at 5.14.29 PM
శెట్టి బలిజ కులస్తుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతా : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద…
ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారిని జీడిమెట్ల శెట్టి బలిజ సంక్షేమ సంఘం సభ్యులు కలిసి ఎన్నికలలో చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అధ్యక్షుడు కడలి విద్యా సాగర్ ప్రధాన కార్యదర్శి గుబ్బల లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ శెట్టి బలిజలు ఎదుర్కొంటున్న సమస్యను అసెంబ్లీలో మాట్లాడి సమస్యను పరిష్కారం దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారిని కోరడం జరిగింది.
శెట్టి బలిజ కులస్తుల సమస్యలపై సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే కేపీ వివేకానంద శెట్టి బలిజలు ఎదుర్కొంటున్న సమస్యలను తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడలి విద్యా సాగర్, సలహదారులు కడలి మురళి కృష్ణ, ప్రధాన కార్యదర్శి గుబ్బల లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ పితాని ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు కడలి సత్యనారాయణ, కడలి హరనాథ్ బాబు,గుబ్బల ప్రసాద్, హరి శేఖర్, ఏవి రావు, యనమదల గిరి బాబు,యల్లమల్లి వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
