
Trinethram News : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిలేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరు సమావేశం అయ్యారు. భేటీ అనంతరం బిలేట్స్ తో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
“బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపాం. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించాం.
స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గేట్స్ ఫౌండేషన్ తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తిమంతం చేయడంతో పాటు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
