Trinethram News : ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి గజానన అపార్ట్మెంట్స్ నందు నిర్వహించిన అయ్యప్ప మహపడిపూజ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. ఇంద్రియాలను నిగ్రహించుకొని అయ్యప్ప స్వాములు మండల రోజుల పాటు నిర్వహించే కఠిన దీక్షలలో అయ్యప్ప దీక్ష ఒకటని, అయ్యప్ప స్వామి దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ చింతల దేవేందర్ యాదవ్, పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు సంగీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


