MLC Thota Trimurthulu : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ సంతకాల సేకరణ

TRINETHRAM NEWS

పేదల ఆరోగ్యం, చదువుపై బాబు వెన్నుపోటు అడ్డుకుందాం!

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

త్రినేత్రం న్యూస్ నవంబర్, 09. మండపేట,ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ఉధృతంగా కొనసాగుతోంది. మండపేట పట్టణ రూరల్ మండలంలోని పాలతోడు గ్రామ సర్పంచ్ పిల్లా అరవ రాజు, టౌన్ 18వ వార్డు యర్రగుంట అయ్యప్పల ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ మహా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని, ప్రైవేటీకరణ దుర్మార్గానికి తమ గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడుతూ మాట్లాడారు. “వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యం, చదువును దృష్టిలో ఉంచుకొని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. కోవిడ్ మహమ్మారి బోధపడిన పాఠాల నుంచి భవిష్యత్ విపత్తులకు సిద్ధంగా ఉండాలంటే ఇది అనివార్యమని ఆలోచించారు.

ఈ కాలేజీల్లో డాక్టర్లు తయారై పేదలకు వైద్యం అందుబాటులోకి వస్తుందన్నదే జగన్ దార్శనికత. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు తాబేదారులకు లాభాలు చేకూర్చేందుకు, కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు ప్రైవేటీకరణ జపం చేస్తున్నారు. ఇది పేదల చదువు, ఆరోగ్యంపై నేరుగా వెన్నుపోటు పొడవడమే!” అని తీవ్రంగా ఆరోపించారు. 8 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆస్తిగా మార్చి, విడతలవారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయవచ్చని తోట సూచించారు. “రాష్ట్ర బడ్జెట్ 2.50 లక్షల కోట్లు ఉన్నప్పుడు కొద్ది మొత్తంలో నిధులు ఉపయోగించి ఈ కాలేజీలు పూర్తయితే ప్రభుత్వానికే శాశ్వత ఆస్తి అవుతాయి. కానీ జగన్ ఆలోచనలకు మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ దుష్ప్రయత్నం చేస్తోంది” అని ఎద్దేవా చేశారు.

ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేసేందుకు సంతకాలు సేకరించి, ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్‌కు తెలియజేయనున్నట్లు తోట త్రిమూర్తులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రూరల్ పట్టణ కన్వీనర్లు పిల్లి శ్రీనివాస్, అడబాల బాబ్జి, పాలతోడు సర్పంచ్ పిల్ల అరవరాజు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి వాసిరెడ్డి అర్జున్, గెడ్డం గాంధీ బాబు, కొప్పిరెడ్డి ప్రసాద్, పిల్లా వీరబాబు, తిరుశూల శ్రీను, గ్రంథం సూరిబాబు, తుమ్మ వీరబాబు, ఉండమట్ల ప్రసాద్, కోటేశ్వరరావు, కౌన్సిలర్లు మెండు బాపిరాజు, జిన్నూరు సాయిబాబు, నియోజకవర్గ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు, వీరమల్లి శ్రీనివాసు, పెంకె గంగాధర్, జొన్నపల్లి సత్తిబాబు, కోళ్ళ శ్రీను, శాఖ సత్తిబాబు, తణుకు అశోక్, బిల్లకుర్తి అంజి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive signature collection

You cannot copy content of this page

Scroll to Top