Naveen Yadav : కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్‌పేట్ డివిజన్ లోని బూత్ నంబర్ 41,42 లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తో కలిసి పరిగి ఎమ్మెల్యే మరియు డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర, ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ప్రజలతో ముఖాముఖీగా మాట్లాడి,ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించి,హైదరాబాద్ అభివృద్ధికి బలం చేకూర్చాలని ప్రజలను కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Make Congress candidate Naveen Yadav win

You cannot copy content of this page

Scroll to Top