వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి పట్టణంలో జరుగుతున్న బోనాల పండుగ , అమ్మవారి తొట్టెల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి .. ఈ సందర్భంగా మారుతి కిరణ్ మాట్లాడుతూ.
ఇలాంటి పండుగలు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తాయని మన కులవృత్తుల సాంప్రదాయాలు, భక్తి మార్గం యువతలో పెంపొందించాల్సిన అవసరం ఉందని మన గ్రామ దేవతల ఆశీస్సులతో అందరూ వారివారి రంగాలలో మరింత అభివృద్ధి చెందాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఆంజనేయులు , నరసింహ , మాజీ పరిగి పట్టణ ప్రధాన కార్యదర్శి జంగయ్య ,బీజేపీ పరిగి పట్టణ కార్యదర్శి జైశ్రీరామ్ , మరియు గంగపుత్ర సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


