త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలంలో స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా టీయం గుంపు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మడివి నాగేశ్వరరావు దశదిన కార్యక్రమం, చిన్నగొల్లగూడెం గ్రామంలో సంఘసాని భిక్షం దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళి అర్పించి ఇరు కుటుంబాలను పరామర్శించారు.
అనంతరం మొద్దులగూడెం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సావిలి శివప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి ప్రమాదవివరాలు తెలుసుకున్నారు. అనంతరం మండలకేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


