వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :సర్పన్ పల్లి గ్రామానికి చెందిన mohd ఖలీల్ అనే వ్యక్తి నాపై చేసిన నిర్ధారమైన ఆరోపణలను ఖండిస్తున్నాను. అంతారం నుండి మోమిన్ కలాన్ రోడ్డు మంజూరైన సందర్భంగా రోడ్డు పనుల నిమిత్తం అంతారంలోని సర్వే నంబర్ 32 లో 1.16 గుంటలు ప్రభుత్వ భూమిలో కాంట్రాక్టర్లు లక్ష్మీకాంత్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి మట్టి తరలిస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ రోడ్డు పనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎండీ ఖలీల్ అంతారంలోని సర్వే నెంబరు 32 82 లో ఉన్న ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమిని హేచరీ నిర్మాణం మేకల ఫామ్ కోసం కేటాయించాలని కోరగా అధికారులు స్పందించకపోవడంతో గౌరవ హైకోర్టులో ఫీల్ దాకా చేయడం జరిగింది. గౌరవ న్యాయమూర్తి విచారించగా హెచ్చరి మేకల ఫామ్ నిర్మాణం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఈయన వేసిన పిల్ ను కొట్టివేయడం జరిగింది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.
ఈ వ్యక్తి అంతారం గ్రామంలో పలువురి దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని వాళ్ల భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం అలాగే భూములను అగ్రిమెంట్ చేసుకొని దొంగ చెక్కులను ఇచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. అంతారం గ్రామం వెళ్తే ఈ వ్యక్తి చరిత్ర అందరూ చెప్తారు ఖలీల్ అనే వ్యక్తి ఇప్పటివరకు నేను కలిసింది లేదు అతనితో మాట్లాడింది లేదు నాపై ఆయన చేసిన ఆరోపణలను నేను ఖండిస్తున్నాను.
నా ఇమేజ్ ని దెబ్బ తీయాలని అనుకుంటే సహించేది లేదు చట్టపరమైన చర్యలు తీసుకుంటా. ఆ భూమికు నాకు ఎలాంటి సంబంధం లేదు ఎవిడెన్స్ లేని ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తది. రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


