Man with knife : ఆదిలాబాద్‌లో కత్తితో వ్యక్తి హల్‌చల్‌

TRINETHRAM NEWS

Mar 03, 2026, ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం సాయంత్రం స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లో వాటా కోసం ఒక వ్యక్తి కత్తితో మరొక భాగస్వామిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు జయప్రకాష్ జైస్వాల్ ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఖానాపూర్‌కు చెందిన ఖలీస్ రంజానీ, తన కుమారుడితో కలిసి విద్యానగర్‌లోని ఒక ప్రైవేటు కార్యాలయంలో జయప్రకాష్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో జయప్రకాష్‌ వేలికి, కడుపులో స్వల్ప గాయాలయ్యాయి. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Man with knife in Adilabad

You cannot copy content of this page

Scroll to Top