ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి
Trinethram News : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పెనుమూరు ఇంచార్జ్. జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం జెట్టి గుండ్లపల్లి లో విషాద ఘటన జరిగింది. పెనుమూరు మండలంలోని జెట్టి గుండ్ల పల్లి గ్రామానికి చెందిన రఘుపతి నాయుడు కుమారుడు దామోదర్ నాయుడు(40) తన సొంత ట్రాక్టర్ తో వ్యవసాయ పొలం దుల్లడానికి బయలుదేరాడు. దారిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఇంజన్ బోల్తా పడి దామోదర్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App