జూన్ 26, 2026
TRINETHRAM NEWS

రూ.400 కోట్లు ఆస్తి నష్టం !

Trinethram News : గుజరాత్‌ దాహోద్‌ లోని భటివాడలో నిర్మాణంలో ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 70 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ అగ్ని ప్రమాదంలో ప్లాంట్‌ లోని 95% పరికరాలు కాలి బూడిదయ్యాయి. దీనితో దాదాపు రూ. 400 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ అగ్నిప్రమాదం జరిగిన తర్వాత రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భటివాడలో నిర్మాణంలో ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 70 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ లో మంటలు మొదలైనట్లు తెలుస్తోంది.

గాలి కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఫలితంగా ప్లాంట్‌ లో ఉన్న సోలార్ ప్యానెల్‌ లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ ఇతర పరికరాలు కాలిపోయాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Major fire breaks out

You cannot copy content of this page