జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి
నూనె వెంకటేశ్వర్లు…
డిండి(గుండ్ల పల్లి) మే 09త్రినేత్రం న్యూస్. తేదీ:09.05.2025 కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, మే 20వ తారీకున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని AITUC జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం AITUC ఆధ్వర్యంలో డిండి ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సదానందం గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 39 కార్మిక చట్టాలను
4 కోడ్లుగా సమూనంగా కుదించి కార్మిక హక్కులను కాలరాస్తుందని, కేంద్ర కార్మిక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం విధానాలను తిప్పి కొట్టాలని, ఆయన కోరారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను కు అనుగుణంగా కార్మికుల వేతనాలు ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలో కొనసాగించాలని కనీస వేతనం 26000 ఇవ్వాలని, వారికి ప్రతినెల 5 వ తారీఖు లోపు జీతాలు అకౌంట్లో జమ చేయాలని,PF ,ESI సౌకర్యాలు కల్పిస్తూ, ఉద్యోగ భద్రత కల్పించాలని ,పంచాయితీ కార్యదర్శుల వేధింపులు కార్మికులపై మానుకోవాలని ,మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు మే 20వ తారీకున సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కార్మికులను కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు , రామావత్ జవహర్ లాల్, పరమేష్ అంజి,భారతి, సుజాత, చెన్నమ్మ, నీలమ్మ, సైదమ్మ ,లక్ష్మమ్మ, కే లక్ష్మమ్మ, మాన్య, బాలమ్మ ,లక్ష్మమ్మ ,సాలమ్మ, నీలమ్మ తదిరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Make the nationwide general

You cannot copy content of this page