Minister Tummala, MLA Jare : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల,ఎమ్మెల్యే జారె

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌళి మార్కెటింగ్ శాఖల మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మరియు స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షించారు.

అనంతరం ప్యాకేజీ నైన్ కింద అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామంలో జరుగుతున్న సీతారామ లిఫ్ట్ తిరిగేషన్ ప్రాజెక్ట్ అభివృద్ధి పనుల ప్రగతిని కూడా వారు సమీక్షించారు. ఇరిగేషన్ అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించి అనుకున్న సమయానికి రైతులకు నిరంతందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Tummala, MLA Jare

You cannot copy content of this page

Scroll to Top