AITUC : 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

TRINETHRAM NEWS

పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల శ్రేయస్సుకే సమ్మెకు సహకరించండి.

త్రినేత్రం న్యూస్ : ఏఐటీయూసీ, ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ లు…
కాకినాడ రూరల్,మే,06: దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందిస్తున్న ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కాకినాడ రూరల్ కార్యదర్శిటీ.అన్నవరం లు. తోకల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మే 20వ తేదీన కార్మిక సంఘాల పిలుపుమేరకు సార్వత్రిక సమ్మె జరగనున్నదని, ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్స్ గా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని, కార్మికుల హక్కులు పొందేందుకు కార్మిక చట్టాలు అమలు చేయాలని, కార్మిక సంఘాలు లేవనెత్తుతున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని,

ఈ సమ్మెకు కాకినాడ జిల్లాలో ఉన్న పరిశ్రమ,పారిశ్రామిక సంస్థ, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక ఉద్యోగులు శ్రేయస్సు కొరకే మే 20న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సహకరించాలని, ఆరోజు సెలవు దినంగా ప్రకటించాలని, కనీస వేతనాలు 35 వేల రూపాయలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటి బోనస్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పని గంటల్లో మార్పు లేకుండా ఎనిమిది గంటల పని దినాలు అమలు చేయాలని, మే 20వ తేదీన కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమలకు సెలవు ప్రకటించాలని APIIC జోనల్ ఆఫీసులో డిపిఓ కి వినతి పత్రం అందజేశామని ప్రసాద్ అన్నారు.

రూరల్ కార్యదర్శి అన్నవరం మాట్లాడుతూ కాకినాడ రూరల్ లో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరూ మే 20వ తేదీన ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎన్నెన్నో పోరాటాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే స్థానికులకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు లేక వలసలు వెళుతున్నారని, కాకినాడ జిల్లాలో ప్రతి పరిశ్రమల్లో మొదటి ప్రాధాన్యతగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమలు పేరుతో భూ కబ్జా చేసిన దళారులపై కేసులు నమోదు చేయాలని, పరిశ్రమల నిర్వహించలేని వారిపై కఠినంగా శిక్షించి వారి వద్ద భూమిని ప్రభుత్వం స్వాధీనంలో చేసుకోవాలని, పరిశ్రమల్లో కార్మికులకు ఉపాధి కల్పించిన వారికే ప్రభుత్వ భూమి కేటాయించాలని, కాకినాడ రూరల్ లో పరిశ్రమలన్నిటిలో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆయన అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Make the nationwide general

You cannot copy content of this page

Scroll to Top