దేవరకొండ డివిజన్ నవంబర్ 28 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు ఉదయం 11 గంటలకు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అధ్యక్షుడు ఎన్ వీ టీ సభ్యులతో కలిసి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ఒక సామాజిక సంస్కర్త, విద్యావేత్త మరియు కుల వ్యతిరేక కార్యకర్త. ఈయన మహిళా విద్య కోసం, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారు అని మరియు సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. జ్యోతిరావు ఫూలే మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త మరియు రచయిత. సమాజంలో కుల వివక్షను, లింగఅసమానతలను రూపుమాపాలని ఆయన ఆకాంక్షించారు.
సమాజంలో సమానత్వం, ప్రేమ, గౌరవం ఉండాలని నమ్మి, ఆయన సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించారు. మహిళల విద్యను ప్రోత్సహించడం, పేదలు మరియు అంటరానివారి జీవితాలను మెరుగుపరచడం వంటి అంశాలపై కృషి చేశారు అని సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, తాళ్ల సురేష్, భాస్కర్ రెడ్డి, శ్రీనయ్య, వలమల్ల ఆంజనేయులు, వంగూరు వెంకటేశ్వర్లు, ఆదర్శ్, చరణ్, రమేష్, ఆనంద్, శివకుమార్, షేక్ శంశోదీన్, భరత్, రాంబాబు, బారిములు, రాజకుమార్, చక్రపాణి, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


