Magnificent Decorations : మురమండలో శూలాల సంబరాలకు వైభవమైన అలంకరణలు

TRINETHRAM NEWS

కోటిపల్లి శ్రీనివాస్‌కు ఘన సత్కారం

త్రినేత్రం న్యూస్, మురమండ గ్రామంలోని శ్రీ భద్రకాళీ వీరభద్రేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ బసవేశ్వరస్వామి దేవాలయం వారి శూలాల సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణాన్ని అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణతో పాటు ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.
ఈ మహోత్సవానికి సంబంధించి విద్యుత్ దీపాలంకరణ మరియు ఇతర అలంకరణల ఏర్పాట్లను అత్యంత శ్రద్ధతో, భక్తి భావంతో నిర్వహించిన శ్రీ కోటిపల్లి శ్రీనివాస్,ని ఈ రోజు దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆయన సేవాభావం, అంకితభావం పట్ల కమిటీ సభ్యులు ప్రశంసలు కురిపించారు.
గ్రామ ప్రజలు కూడా ఉత్సవాలను విజయవంతం చేసినందుకు శ్రీనివాస్,కి అభినందనలు తెలియజేశారు. ఉత్సవాలు భక్తుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి.
జై బసవేశ్వర స్వామి,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Magnificent decorations for the Shula festival

You cannot copy content of this page

Scroll to Top