కోటిక్రతువుల శ్రీకరం “మాఘమాసం”
Trinethram News : కాకినాడ : 1.2.2025, శ్రీవారి సేవా సమాజం ఆధ్వర్యాన కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడివీధిలోనిస్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 70వ జపయజ్ఞ పారాయణ జరిగింది. శనివారం ఉదయం విష్ణు సహస్ర నామ పారాయణతో రాజ్యలక్ష్మీసమేతభావన్నారాయణ స్వామిని ఆరాధించారు. మాఘ మాసంలో నారాయణు ని పూజ వలన అంతర్గతశాంతి ఆధ్యాత్మిక సాఫల్యత కోటి క్రతువుల శ్రేయస్సు కలుగుతుందని పీఠం తెలియ జేసింది.
రథసప్తమి భీష్మఏకాదశి మహా శివరాత్రి మాఘమాస పర్వదినాలు కాగా భావ సంయుక్తంగా భక్తుల సత్సంకల్పాలు నెరవేర్చే పంచ భావనారాయణ క్షేత్రాల్లో మహావిష్ణువుని దర్శించడం మాఘఫల వైశిష్ట్యంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. మాఘమాస వ్రతం నిర్వహించిన ముత్తయిదువులకు తాంబూలాలు ప్రధానం చేసారు. మాఘమాస వ్రతం నిర్వహించిన శ్రీవారి భక్తులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App