MLA Raj Thakur : మేడిపల్లి గ్రామంలో హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ధన్యవాదాలు తెలిపిన మడిపెల్లి మల్లేష్

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఒకటోవ డివిజన్ మేడిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆదివారం రోజున మేడిపల్లి గ్రామంలోని హనుమాన్ గుడి వద్ద ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర గల మేడిపల్లి గ్రామంలో గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేక కనీసం వీధిలైట్లు లేక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతుండగా మేడిపల్లి గ్రామం ప్రజల యొక్క పరిస్థితిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపిన వెంటనే స్పందించన ఎమ్మెల్యే రామగుండం కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్ అరుణ లెటర్ రాసి బతుకమ్మ రోజున మేడిపల్లి మహిళా సోదరీమణులు హైమాక్స్ లైట్ల వెలుగుల్లో ఆనందంగా బతుకమ్మ ఆడుకోవడం కోసం ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా కమిషనర్ కు తెలుపడంతో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ యుద్ధ ప్రాతికరంగా పనులు జరిపించి మేడిపల్లి గ్రామంలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని మల్లేష్ తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Madipelli Mallesh thanks MLA Raj Thakur

You cannot copy content of this page

Scroll to Top