WhatsApp Image 2024 06 11 at 18.48.56
Madipelli Mallesh, president of Seva Spurti Foundation, presented the 29th month check to Sai Sudikshita
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల అనిల్ కుమార్ కుమార్తె సాయి సుదీక్షిత మెడిసిన్ విద్యార్థినికి.గత 29 నెలలుగా ప్రతి నెల మొదటి వారంలో సేవా స్పూర్తి ఫౌండేషన్ తరుపున విద్యార్ధినికి రెండు వేల రూపాయలు అందజేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా మంగళవారం రోజున గాంధినగర్ లోని సాయి సూదీక్ష ఇంటి వద్దకు వెళ్లి రెండు వేల రూపాయల చెక్ ను సాయి సుదీక్ష తండ్రి గద్దల అనిల్ కుమార్ కు అందజేయడం జరిగిందని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ గత 29 నెలల నుండి సాయి సుదీక్ష కు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరి సహకారంతో ప్రతినెల రెండు వేల రూపాయలు అందజేస్తామని ప్రతి నెల ఫౌండేషన్ కు సహాయ సహకారం అందిస్తున్నా సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరికీ పేరుపేరునా సాయి సుదీక్ష తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
