కూకట్పల్లి ఫిబ్రవరి 18 (త్రినేత్రం న్యూస్) ఈ రోజు ప్రముఖ సంఘసంస్కర్త మాదరిభాగ్యరెడ్డివర్మ 87వ వర్ధంతిని గ్రేటర్ హైదరాబాద్ అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం (ఏఐఏవైయస్) అధ్యక్షులు కర్క నాగరాజు ఆధ్వర్యంలో మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర బిసి వికాససమితి అధ్యక్షులు భాశెట్టి నర్సింగ్ రావు, విచ్చేసి అయన చిత్ర పటానికి ఫూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ అణిచివేతకు, అన్యాయానికి, సామాజిక అసమానతలకు, వివక్షతకు వ్యతిరేకంగా అందరికీ విద్య అందించడానికి అలుపెరుగని కృషి చేసిన సామాజిక విప్లవకారుడు భాగ్య రెడ్డి వర్మ అని,హైదరాబాద్ చదర్గాట్ ప్రాంతం లో 26 బాలికల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద బడుగు బలహీనవర్గాలకు విద్య నందించారు.
యువకుల కోసం జగన్ మిత్రమండలి స్థాపించి దళితుల సమస్యల పై పోరాటం చేసారు.దేశంలో దళితుల సమస్యలపై మాట్లాడడానికి రౌండటేబుల్ సమావేశంలో తనకు పాల్గొనే అవకాశం ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును ప్రతిపదించిన గొప్ప నాయకుడు అని తెలిపారు.భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ అంబేద్కర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అమరజ్యోతి అసోసియేషన్ అధ్యక్షులు కర్కనిఖిల్,కాంగ్రెస్ నాయకులు కర్క నర్సయ్య, అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులు కూతడి కృష్ణా,సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురజాల రాజు, బీజేపీ నాయకులు శివరాజ్ యాదవ్,హెచ్.ఎ.ల్ యూనియన్ నాయకులు వడ్డే నాగార్జున,పోలేపల్లి శ్రీకాంత్,ఐసిడి కంటైనర్స్ యూనియన్ నాయకులు జగన్,డోలాక్ నర్సింగ్, గురజాల నాగరాజు,అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం మూసాపేట్ డివిజన్ అధ్యక్షులు కర్క మహేష్, పాషా, మూలప్ప,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


