త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి.. సినిమా అంటే హైదరాబాదులోనే కాదు మనం ఉన్న ఊర్లో కూడా తీసుకోవచ్చు అని తీసి చూపించిన సినిమా ఈ కొత్త సినిమా (సినిమా పేరే కొత్త సినిమా). గత నెలలో మొదటి పోస్టర్ విడుదల చేసుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే, ఈ సినిమా కి దర్శకునిగా & నిర్మాతగా అజార్ అన్ని తానై అజార్ సినీ ఏరినా అనే బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు.
తాజాగా ఈ సినిమా రెండవ పోస్టర్ ను ఇండియన్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గారిచే విడుదల చేయించడం జరిగింది. గోదావరిఖనిలో గోదావరిఖని వాళ్ళని పెట్టుకొని ఈ సినిమా నిర్మించారు. ఇది పక్కా తెలంగాణ యాసలో ఉంటుంది.
ఈ సినిమాలో నటించిన అందరూ కొత్త వాళ్లే కావడం విశేషం, 100 మందికి పైగా కొత్త వాళ్లను పెట్టి సినిమా తీసి ఈ సినిమాకి కొత్త సినిమా అని పేరు పెట్టడం జరిగింది. ఇలాంటి సినిమాలు హిట్ కావడం కొత్త తరం వారికి కొత్తగా సినిమాలు తీద్దాం అనుకుంటున్న వారికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ సినిమా మొత్తం పనులు పూర్తి చేసుకొని ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతుంది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


