జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 09.16.08

TRINETHRAM NEWS

లోకేష్ మార్క్ – వాట్సాప్ గవర్నెన్స్

Trinethram News : Andhra Pradesh : కార్పొరేట్ సంస్థలు తమ కస్టమర్లకు సీమ్‌లెస్ సేవలు అందించడానికి వాట్సాప్ మీద ఆధారపడుతున్నాయి. అపాయింట్ మెంట్ బుకింగ్ దగ్గర నుంచి ఫీజు రిసీప్ట్ వరకూ మొత్తం వాట్సాప్‌లో అందేలా ఏర్పాట్లు చేశాయి. చాట్ బాట్స్ ద్వారా ఒక్క మెసెజ్‌తో సమాచారం ఇస్తున్నాయి. ఇలా ప్రజలకు కూడా క్షణాల్లో సమాచారం ఇచ్చే .. అవసరమైన పౌరసేవలు అందించేలా చేయాలని నారా లోకేష్ చేసిన ఆలోచన గురువారం కార్యాచరణలోకి వస్తోంది.

గత ఏడాది మెటాతో.. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఒప్పందం చేసుకున్నారు. 161 రకాల పౌరసేవలు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు టెక్నికల్‌గా అన్ని పనులు పూర్తి చేసి ఇవాళ్టి నుంచి అమల్లోకి తీసుకు వస్తున్నారు. పుట్టిన రోజు ధృవపత్రాలు, మరణధృవపత్రాలు, క్యాస్ట్ సర్టిఫికెట్లు సహా ఇప్పటికే రికార్డుల్లో ఉన్న ఏ యాక్సెస్డ్ డాక్యుమెంట్ అయినా వాట్సాప్ లో ఓ మెసెజ్ పెడితే వచ్చేస్తుంది.

ఈ విధానం చాలా సులువు అయినది. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇలాంటి సర్వీసు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ సేవలు అందించడానికి గత ప్రభుత్వం లెక్కలేనన్ని గ్రామ, వార్డు సచివాలయాలు పెట్టింది. వేల కోట్లు ఖర్చు పెట్టింది. కానీ లోకేష్..ఆ సేవలన్నింటినీ వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page