MLA Vegulla : సి.హెచ్.సి లో రక్తదాన శిభిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని మండపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు సూపరింటెండెంట్ డా॥రాధా కుమారి, ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిభిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. రామచంద్రాపురం ఏరియా హాస్పటల్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ వారు దాతల నుండి బ్లడ్ సేకరించారు.

ఈ కార్యక్రమంలో హాస్పటల్ అభివృద్ది కమిటీ సభ్యులు కురసాల వీరవెంకట సత్యనారాయణ, కోనే వీర్రాజు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిరుకూరి బాపిరాజు, రోటరీ క్లబ్ అధ్యక్షులు వి.భూషణం, డా॥సునీత, సిబ్బంది సి.హెచ్.వాసు, ఎస్.ప్రభాకరరావు, డి.నరసింహులు, బి.ఎస్.కె.రెడ్డి, ఆర్.అన్నపూర్ణ, వై.ప్రిసిల్లా, హెడ్ నర్స్ మాధురి, తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vegulla inaugurated the

You cannot copy content of this page

Scroll to Top