విజయనగరంజిల్లా గజపతినగరం మండలం అక్టోబర్ 23, (త్రినేత్రం న్యూస్): విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం: మర్రివలస గ్రామ ప్రజలు దశాబ్దాలుగా రాకపోకల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి వెళ్లే మార్గమధ్యలో వాగుపై వంతెన లేకపోవడంతో వర్షం పడితే వాగు పొంగిపొర్లి గ్రామం ప్రపంచం నుంచి వేరుపడిపోతోంది.
ఇటీవలి వర్షాలతో రవాణా పూర్తిగా స్తంభించగా, అనారోగ్యానికి గురైన మూగాడ రవణమ్మ మహిళను ఆసుపత్రికి తరలించేందుకు గ్రామస్తులు ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటిన ఘటన స్థానికులను కుదిపేసింది. “వర్షం మొదలైతే మాకు బయటి ప్రపంచంతో సంబంధమే ఉండదు. పిల్లల చదువు, కూరగాయలు, ఔషధాలు అన్నీ ఆగిపోతాయి” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వారు, తక్షణమే వాగుపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


