అల్లూరి జిల్లా పాడేరు అక్టోబర్ 23, (త్రినేత్రం న్యూస్): అల్లూరి జిల్లా పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో మండల కోర్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం లక్ష్యంగా వ్యూహాలు చర్చించారు.
గంగులయ్య మాట్లాడుతూ, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని, కోర్ కమిటీ ప్రతిపాదనలు పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. పంచాయతీల అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రతినిధి బొంకుల దివ్యలత, మండల అధ్యక్షుడు నందోలి మురళి కృష్ణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పాంగి శివాజీ, ప్యాక్స్ డైరెక్టర్ వంపూరు రమేష్, మండల ఉపాధ్యక్షుడు సీసాల భూపాల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


