Trinethram News : Feb 09, 2026, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో ఫిబ్రవరి 11,13,16న లిక్కర్ షాపులు బంద్ కానున్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 11న ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఈ నేపథ్యంలో, ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల నిబంధనలు రేపటి సాయంత్రం నుంచే అమలులోకి వస్తాయని ఎన్నికల అధికారులు తెలిపారు. 2,996 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

