Lion Advocate Adilakshmi : గోదావరి వరద బాధితులకు లయన్ అడ్వకేట్ ఆదిలక్ష్మి ఆపన్నహస్తం

TRINETHRAM NEWS

రాజమహేంద్రవరం ఆగష్టు 25: త్రినేత్రం న్యూస్, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రకృతి సోయగాలను ఆస్వాదించే వారికి ఇది కనువిందుగా కనిపించినా, గోదావరి మధ్యలో గుడిసెల్లో జీవనం సాగిస్తున్న పేదల కళ్లలో మాత్రం కన్నీటి బొట్లు నింపుతోంది. లంకల్లో నిలువ నీడ లేకుండా, చుట్టూ నీరు ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. పగలు రాత్రి కష్టాలు, వర్షపు దెబ్బలు, కారుచీటలతో పోరాడుతూ బ్రతుకుతున్న వారిది దయనీయ దృశ్యం.యానాం పరిసర ప్రాంతాల నుండి పొట్టకూటికోసం కుటుంబాలతో వలస వచ్చిన ఈ పేదలు ప్రతిసారి గోదావరి ఉధృతికి బలి అవుతూ తమ గుడిసెలను కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో వారిని పునరావాస కేంద్రాల్లో ఉంచి నగరపాలక సంస్థ అవసరాలు చూసుకుంటోంది.
ఈ నేపథ్యంలో “ వి ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ” తరఫున డాక్టర్ సన్నీ గారు వరద బాధితుల పరిస్థితిని తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు. పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి వెంటనే సహాయం చేయాలన్న తపన కలిగింది. దీంతో ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే మహోన్నత వ్యక్తి శ్రీమతి లయన్ అడ్వకేట్ ఆదిలక్ష్మి ని కలిసి బాధితుల పరిస్థితిని వివరించారు. విషయం తెలిసిన వెంటనే ఆదిలక్ష్మి తీవ్ర విచారం వ్యక్తం చేసి, బాధితులకు ఆహార పదార్థాలు అందించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు.
తన మాట నిలబెట్టుకుని ఈరోజు అక్కడ ఉన్న 100 మంది పిల్లలకు, 80 మంది వృద్ధులకు, 10 మంది గర్భిణీ స్త్రీలకు ఆపిల్‌, అరటిపండు, బత్తాయి, జామపండు, వేరుశెనగ అచ్చు, బిస్కెట్లు పంపిణీ చేశారు. గర్భిణీలకు ప్రత్యేకంగా పచ్చడి, ఖర్జూరం, మామిడితందిర, మిక్చర్‌, బ్రెడ్‌ తదితర పోషకాహార పదార్థాలు అందించారు. ఆదిలక్ష్మి ఆప్యాయతతో చేసిన సహాయం అందుకున్న వారు ఆనందభాష్పాలతో స్పందించారు. “ఆమెలో మేము తల్లిని, అక్కను, చెల్లిని, స్నేహితురాలిని చూశాం. ఇంత స్నేహపూర్వక పలకరింపును ఎప్పుడూ చూడలేదు” అని పేర్కొన్నారు.
డాక్టర్ సన్నీ మాట్లాడుతూ “అడిగిన వెంటనే స్పందించి ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఆదిలక్ష్మి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు. అలాగే 2015లో హుద్‌హుద్ తుఫాన్‌ సమయంలోనూ, 2024లో విజయవాడ బుధమేరు వాగు పొంగి ప్రజలు ఇబ్బందులు పడినప్పుడూ ఆమె తన సొంత ఖర్చులతో సహాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మరణానంతరం తన సంపూర్ణ అవయవాలను దానం చేయాలన్న సంకల్పం ప్రకటించడం ద్వారా సమాజానికి ఆదర్శం చూపించిన మహోన్నతురాలని కొనియాడారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lion Advocate Adilakshmi extends help

You cannot copy content of this page

Scroll to Top