త్రినేత్రం న్యూస్ : బలబద్రపురం. చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన పరిశ్రమ వద్దని గ్రామస్థులు తీర్మానం చేయడం చాలా సంతోషించతగ్గ విషయమన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ. ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం బలభద్రపురం గ్రామానికి 250 మీటర్ల దూరంలో ప్రభుత్వం వారు తలపెట్టిన చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన పరిశ్రమపై పంచాయతీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సభ నిర్వహించడం జరిగింది.
అయితే చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను ప్రభుత్వం ఆరు చోట్ల చెత్తను నివారించాలని సంకల్పంతో ఈ పరిశ్రమలను ప్రారంభించడం జరిగిందని అయితే అన్నిచోట్ల వేరు బలబద్రపురంలో పరిస్థితి వేరని బలభద్రపురం లో ఇప్పటికే కే పి ఆర్ సంస్థ ఆధ్వర్యంలో కెమికల్ పరిశ్రమలు, గ్రాసమ్ ఇండస్ట్రీ పేరుతో మరో కెమికల్ పరిశ్రమ ఉండటం తద్వారా బలభద్రపురం గ్రామంలో ఎక్కువ శాతం క్యాన్సర్ బారిన పడటం అంతేకాకుండా భూగర్భ జలాలు అడుగంటి పోవడం జరుగుతున్న కారణంగా చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన కేంద్రం కాపవరం గ్రామ పరిధిలోకి వచ్చిన అది బలభద్రపురం గ్రామానికి అతి చేరువులో ఉండటంతో కాపవరం గ్రామం లో చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన పరిశ్రమ వద్దని తీర్మానించగా పక్కనే ఉన్న బలవద్రపురం గ్రామంలో కూడా దీనిపై గ్రామసభ నిర్వహించాలని వచ్చిన ఫిర్యాదుల మేరకు గ్రామసభ నిర్వహించడం జరిగింది.
చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన పరిశ్రమ వద్దని తీర్మానం చేయడం చాలా సంతోషించతగ్గ విషయమని అధికారులు వచ్చినప్పుడు కూడా ఇదేవిధంగా చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలన్నారు.బలబద్రపురంలో క్యాన్సర్ బాధితులు ఎక్కువ ఉండడంతో చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రుల డాక్టర్లతో విషయాన్ని ప్రస్తావించగా వారు కూడా బలబద్రపురం గ్రామంలో క్యాన్సర్ బాధితులు కేసులు యెక్కువ వస్తున్నాయి అని తెలియడంతో దీనిపై అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని అయితే గత ప్రభుత్వం నాయకులు మాత్రం బలభద్రపురం గ్రామంలో భూమి రేట్లు తగ్గిపోతున్నాయని బలభద్రపురంలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావని,
బలభద్రపురం అమ్మాయిల్ని బయట ఊళ్లో వారు పెళ్లి చేసుకోరంటూ అనేక దుష్ప్రచారాలు చేయడం జరుగుతుందని ఇది ప్రచారం మాత్రమేనని క్యాన్సర్ నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ పరీక్షలు నిర్వహించి ప్రాథమిక దశలో ఉన్నట్టు నిర్ధారణ అయితే వెంటనే చికిత్స పొందితే క్యాన్సర్ నివారించవచ్చు అని మలిదశ నివారించడం కష్టమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని ఇటువంటి పరిస్థితుల మధ్య ఇటువంటి పరిశ్రమలకు నేను నా ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకంగానే పోరాడుతామని చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన పరిశ్రమ గ్రామ పరిసర ప్రాంతాల్లో రాకుండా తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు కార్యకర్తలు,బలభద్రపురం గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


