Students who Created a Stir : ప్రభంజనం సృష్టించిన విద్యార్థులు

TRINETHRAM NEWS

తేదీ:9/05/2025 ఎన్టీఆర్ జిల్లా: ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ రూరల్ తాడేపల్లి కొత్తూరు గ్రామంలో ఉన్న సెయింట్ బెండిక్స్ పాఠశాల యందు విద్యార్థులు సుమారు ఒకవేయ 300 మంది అందులో ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కలదు. ప్రతిరోజు సమయ అనుకూలంగా తరగతులు మరియు క్రీడలు జరుగుతున్నవి. సుమారు 22 కిలోమీటర్ల దూర ప్రాంతాల గల విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుచున్నారు. ఆరు బస్సుల రవాణాసౌకర్యం కలిగి ఉన్నది. ప్రతిరోజు సమయానికి అనుగుణంగా విద్యార్థులు ఈ బస్సుల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది.

మొన్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 68 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ప్రతి ఒక్కరికి 600 మార్కులకు గాను 400 కు పైగా మార్కులు సాధించారు. అందులో ప్రథమ స్థానాన్ని రామ్ చరణ్ 582 మార్కులు సాధించి విజయాన్ని సాధించాడు. ద్వితీయస్థానాన్ని లావణ్య 580 మార్కులను స్వాధీనం చేసుకుంది. తృతీయ స్థానాన్ని శ్రీవల్లి 579 మార్కులతో కైవసం చేసుకుంది. వాళ్లకు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం యాజమాన్యం ప్రజలు అభినందనలు తెలపటం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు చిన్నప్ప తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Students who created a stir

You cannot copy content of this page

Scroll to Top