అమెరికా సామ్రాజ్యవాదం నుండి మన దేశ సార్వభత్వాన్ని కాపాడుకుందాం రైతు ప్రజాసంఘాల పిలుపు

TRINETHRAM NEWS

వరంగల్ జిల్లా 13 ఆగస్టు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జాతీయ సంఘాల పిలుపులో భాగంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ఎస్ కే యం జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు అధ్యక్షతన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక రైతు సంఘాల నాయకులు గన్నారపు రమేష్, ముక్కెర రామస్వామి, సోమిరెడ్డి శ్రీనివాస్, ఈసంపల్లి బాబు, అక్కనపల్లి యాదగిరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సామ్రాజ్యవాద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశంపై పెత్తనాన్ని చలాయిస్తూ దేశ సార్వభవాన్ని మంట కలుపుతూ మన దేశంపై తన వ్యాపార లాభాల కోసం 50 శాతం సుంకాలను విధించడం వల్ల దేశ ప్రజానీకాన్ని మంట కలిపే విధంగా ఉందన్నారు ట్రంపు భారతదేశాన్ని యావత్ ప్రజానీకాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చేస్తున్నట్లు ట్రంపు చట్టపట్టలేసుకొని మైత్రిని కొనసాగించిన పరిస్థితి ఏమైందన్నారు 50% సుంకాలను మన దేశంపై ఎందుకు విధించారు దేశ ప్రజలకు నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు..అమెరికా అధ్యక్షుడు ట్రంపు పాకిస్తాన్ పై కొత్తగా మైత్రిని కొనసాగిస్తూ మన దేశంపై శత్రుత్వాన్ని పెంచే విధంగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ట్రంపు తన ఆయుధాలను అమ్ముకోవడం కోసం పేద దేశాలపై పెత్తనం చలానిస్తున్నాడు అన్నారు
ఒక పక్కన ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే విధంగా అమెరికా అధ్యక్షుని మన దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా మోడీ ప్రయత్నం చేశారని అన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికప్రజ వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తుందన్నారు ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపద సహజ వనరులు ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెడుతున్నటువంటి పరిస్థితి దాపరించిందన్నారు దేశంలో నిరుద్యోగం పేదరికం ధరల పెరుగుదల వల్ల ప్రజానీకం కార్మిక వర్గం బ్రతికే అటువంటి పరిస్థితి లేదన్నారు 50% సుంకాల మూలంగా మరోసారి భారతదేశంలో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని దేశ ప్రజలు బ్రతికేయటువంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజానీకాన్ని హక్కుల కోసం కార్మిక వర్గాపోరాటాలు చేయకుండా అంచు వేస్తుందన్నారు ఎంతో ప్రాణ త్యాగం చేసి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి యాజమాన్లకు పెట్టుబడిదారులకు అనుకూలంగా హక్కులను తీసుకువచ్చి కార్మిక వర్గంను బానిసత్వంలోకి నెట్టే విధంగా బిజెపి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తుందన్నారు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మన దేశ మనుగడను కాపాడుకోవడం కోసం కార్మిక హక్కులను రక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేయాలని ప్రజా సంఘాల నాయకత్వం పిలుపునిచ్చారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాపాడాలని అమెరికా సామ్రాజ్యవాద పెత్తనాన్ని వెనక్కి కొట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నాయకులు నర్రా ప్రతాప్, వీరగోని శంకరయ్య, చిర్రా సూరి, తిరుపతి, కోరబోయిన కుమార స్వామి, మాలోత్ సాగర్ ,ఎండి యాకూబ్ , బొట్ల శ్రీనివాస్, సుంకా మొగిలి ,ఎండి మెహబూబ్ పాషా ,మల్లికార్జున్ ,ఓదేల్ రత్నం మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

American imperialism, call of farmers'

You cannot copy content of this page

Scroll to Top