కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 13 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇంద్రహిల్స్ కాలనీ లో డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల కు సంబంధించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా, కార్పొరేటర్ ఇంద్రహిల్స్ కాలనీ లో పాదయాత్ర చేసి సమస్యలను జి.ఎచ్.ఎం.సి ఇంజినీరింగ్, జలమండలి మరియు హైడ్రా అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ లో డ్రైనేజీ లైన్ తరుచుగా పొంగి ఓవర్ ఫ్లో అవ్వడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని, మ్యాన్ హొల్స్ లో మట్టి పుడుకుపోయి సమస్య ఏర్పడుతుందని మ్యాన్ హొల్స్ లోపల ప్లాస్టింగ్ చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియచేసారు.
అదేవిధంగా కాలనీ లో కొంతమేర పెండింగ్ ఉన్న సీసీ రోడ్లను కూడా త్వరలో నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఇప్పటికే ఇంద్రహిల్స్ కాలనీ లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, త్రాగునీరు వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందించి అభివృద్ధి చేశామని, కొంతమేర మిగిలిఉన్న పెండింగ్ వర్క్స్ కూడా పూర్తిచేసి ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు వెంకట్ నాయక్, రామారావు, నాగేందర్, కిషోర్, రమేష్, విఠల్, విజయ్, శ్రీశైలం, రాకేష్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, సూపర్వైజర్ శివ, హైడ్రా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


