T. Rammohan Reddy : రేపు ఎల్బి స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేద్దాం

TRINETHRAM NEWS

పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు వికారాబాద్ జిల్లా.
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ఎల్బీ స్టేడియంలో రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుల సమ్మేళనం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని స్పీకర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు కలిసి పరిగి ఎమ్మెల్యే & డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ…* రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ సభకు వికారాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున్న హాజరుకావాలన్నారు.జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్..అనే నినాదంతో భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు,ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్న తరుణంలో,రేపు జరిగే ఈ సభను విజయవంతం చేయాలని రాబోయే స్థానిక సంస్థలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షించే విధంగా ఈ మతతత్వ శక్తుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయాలని,దేశంలో మోడీ చేస్తున్న బీసీ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలన్నారు.ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు కాంగ్రెస్ పార్టీ గ్రామ,మండల,జిల్లా స్థాయి నాయకులతో జరిగే సమావేశానికి అందరూ హాజరయ్యి సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్,టిపిసిసి ఉపాధ్యక్షులు బొంతు రామ్మోహన్ ,తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి , నారాయణపేట్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి , టిపిసిసి ప్రధాన కార్యదర్శులు సుబ్బారావు ,టోపాజీ అనంత కిషన్ మరియు స్థానిక ప్రజాప్రథినిధులు, నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's make the meeting

You cannot copy content of this page

Scroll to Top