వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధిద్దాం.. తెలంగాణలో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు హక్కుల సాధన కొరకు రాష్ట్ర బీసీ సంఘాల JAC ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ 18 శనివారం తెలంగాణ బంద్ కి పిలుపునివ్వడం జరిగింది.*
ఈ సందర్భంగా పాలసీతలీకరణ కేంద్రం పరిగి లో వివిధ బీసీ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని తమ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది*
పరిగి నియోజకవర్గంలోని వ్యాపార సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా సంపూర్ణంగా బందును పాటించి మద్దతు తెలుపాలని వివిధ వర్తక, వాణిజ్య సంఘాలను కలిసి సమాచారం ఇచ్చి సహకరించాల్సిందిగా కోరడం జరిగిందిశనివారం ఉదయం 9 గంటలకు పరిగి అమరవీరుల చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించాలని ర్యాలీలో పార్టీలకతీతంగా బీసీ సంఘాల నాయకులు ప్రజలు ప్రజాసంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరడం జరిగిందికావున పరిగి నియోజకవర్గంలోని అన్ని వ్యాపార వాణిజ్య సముదాయాలు పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా సంపూర్ణ బందును పాటించాల్సిందిగా కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు బీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు ముకుంద నాగేశ్వర్, పరిగి మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు చాకలి రాములు, చాకలి ఆంజనేయులు, ఆంజనేయులు, ఎస్.పి. శ్రీనివాస్, నర్సింలు, దోమ శ్రీశైలం ముదిరాజ్, మాజీ పరిగి ఉపసర్పంచ్ బషీర్, మీర్ తాహిర్ అలీ, గౌస్, సింగం, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు*
బీసీ సంఘాల జేఏసీ పరిగి నియోజకవర్గం*
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


