HP Gas Godown : హెచ్ పి గ్యాస్ గోడౌన్ కు దారేది

TRINETHRAM NEWS

వినియోగదారులకు తీవ్ర ఇబ్బంది.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది.

వినియోగదారులతోనే నడుస్తున్న సంస్థ వినియోగదారులకే చుక్కలు చూపిస్తున్న వైనం.

గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలన్న, గ్యాస్ సిలిండర్. డెలివరీ తీసుకోవాలన్న వినియోగదారులకు తప్పని తిప్పలు. ,
డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 17 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో హెచ్ పి గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి మండల .. పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ప్రతిరోజు వస్తూ ఉంటారు. హెచ్ పి ఆఫీసులో గల సిబ్బంది వినియోగదారులతో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి వచ్చిన వారితో మరియు గోడౌన్ వద్ద డెలివరీ కి వెళ్లే వారి పట్ల సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా వచ్చిన వినియోగదాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు, తమకేమీ తెలీ నట్లుసమాధానాలు చెప్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.
గోడౌన్ కు వెళ్లే దారి గుంతల మయంగా వర్షపు నీటితో బురద మయంగా గుంతలన్నీ నిండి వాహనాలు వెళ్లడానికి వీలు లేకుండా ఉన్న హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని , మాకేం తెలీదు మేము ఏం ఎరుగనట్లు వ్యవహారిస్తున్నారని పలువురు డిండి మండల ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం స్పందించి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారని పలువురు కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

HP Gas Godown is a disaster

You cannot copy content of this page

Scroll to Top