May Day : కార్మికుల చట్టాల పునరుద్దరణకు మే డే ను జరుపుకుందాం

TRINETHRAM NEWS

నూనె వెంకటేశ్వర్లు( a i t u c జిల్లాసహాయ కార్యదర్శి). డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్24 త్రినేత్రం న్యూస్. 139 వ మే డే ను అమరవీరుల స్ఫూర్తితో 4 లేబర్ కోడ్ ల రద్దుకై 29 కార్మికుల చట్టాల పునరుద్ధనకై మేడే ను జరుపుకుందామని, ఏ ఐ టి యు సి జిల్లకార్యదర్శి కార్మికులకు పిలుపు నిచ్చారు.

డిండి మండల కేంద్రంలో గోడ పత్రిక ఆవిష్కరించడం జరిగింది.

అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర భారత దేశంలో పాలకులపై పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను ఏక మొత్తంగా బి జె పి ప్రభుత్వం రద్దు చేస్తుంది. పరిశ్రమలలో యూనియన్ ఏర్పాటు ను అడ్డుకుంటున్నారు. సమ్మె హక్కు హరించబడింది.
ఇల్లీగల్ సమ్మె పేరుతో కార్మికులు మరియు కార్మిక నేతలను జైలు శిక్షలా, మరోపక్క పారిశ్రామిక వేత్తలకు లాభాలా, ఎద్దు పుండును కాకి ముద్దు పెట్టు కొద్దన్న చందంగా పెట్టుబడిదారులకు లక్షలాది మంది ఉద్యోగాలు నుండి తొలగించడం జరిగింది.
నాలుగు లేబర్ ల కోడ్లను రద్దుచేసి, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, పెన్షన్ చట్టాలను అమలు చేయాలని, హమాలి ఆటో, ట్రాన్స్ పోర్ట్, కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని తేవాలని యూనియన్ రిజిస్ట్రేషన్లు 1926 చట్టం ప్రకారం అమలు చేయాలి కార్మిక సమస్యలను పరిష్కరించాలి.
భవన నిర్మాణ కార్మికుల ప్రమాద మరణానికి 10 లక్షల భీమా ఇవ్వాలని, 55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికులకు 5000 పెన్షన్ చెల్లించాలని, గ్రామపంచాయతీ గురుకుల మోడల్ హాస్టల్, ఐకెపి కార్మికులకు జీతం చెల్లించాలని గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని అనుసరించి జెడ్పీ నిధుల నుండి నేరుగా 26 వేల జీతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మే ఒకటో తారీఖు నాడు గ్రామ గ్రామాన మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆయన కార్మికులను కోరారు.
ఈ కార్యక్రమం లో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బుషిపాక సాయిలు, ఎలిమినేటి దేవయ్య గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు రామావత్ జవహర్లాల్, అవుట చెన్నయ్య, కిన్నెర గంగం, అవుట బాలమ్మ, అవుట సాలమ్మ ,సైదమ్మ, సిపోరా, చెన్నమ్మ, భాగ్యమ్మ, లక్ష్మమ్మ, రాములు, బొందయ్య లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's celebrate May Day

You cannot copy content of this page

Scroll to Top