AITUC : కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

TRINETHRAM NEWS

సింగరేణి సి అండ్ ఎండి కి వినతి పత్రాన్ని ఇచ్చిన గుర్తింపు సంఘం ఏఐటియుసి నాయకులు

*గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ల ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్బర్ అలీ , అధ్యక్షులు బుర్ర తిరుపతి , సహాయ కార్యదర్శి అప్రోజ్ ఖాన్ లు సింగరేణి సి అండ్ ఎండి కి ఇచ్చిన వినతి పత్రం లో పేర్కొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ కోల్ ఇండియా లాగా హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని, హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించే వరకు జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలనీ, కాంట్రాక్టు కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని, మైన్స్ యాక్ట్ ప్రకారం ప్రతి కాంట్రాక్టు కార్మికునికి పండుగ సెలవులు, లీవులు, సిక్కులు ఇవ్వాలని, నాగాల పేరిట కార్మికుల వద్ద నుంచి కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్న పెనాల్టీ సిస్టం వెంటనే రద్దు చేయాలని, ఓపెన్ కాస్ట్ లలో పనిచేసే డ్రైవర్లను వోల్వో ఆపరేటర్లుగా గుర్తించి హై స్కిల్ల్డ్ వేతనాలు చెల్లించాలని వారు అన్నారు.

సింగరేణి కార్మికులకు చెల్లించే విధంగా అలవెన్సుల ను కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని, ఓవర్ టైం అలవెన్స్ మరియు ఆదివారం డ్యూటీ చేస్తే అదనంగా వేతనం చెల్లించాలని, ఓపెన్ కాస్ట్ లలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కొందరు కాంట్రాక్టర్లు టెండర్లో ఉన్న కార్మికుల కంటే అదనంగా కార్మికులను తీసుకొని వారి వద్ద నుండి డబ్బులను వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న పనిని బట్టి సేమి స్కిల్డ్డ్, స్కిల్డ్ మరియు హైస్కిల్డ్డ్ వేతనాలు చెల్లించాలని కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు, చైర్మన్ సానుకూలంగా స్పందించారని వారు తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Resolve issues of contractworkers

You cannot copy content of this page

Scroll to Top