జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. అనపర్తి :ఎస్. ఎస్. సి 2025ఫలితాల్లో అనపర్తి శ్రీ చైతన్య విద్యాలయ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తమ ప్రతిభ ను కనబరచి అనపర్తి మండలం లో ఏ విద్యాసంస్థల కు రాని విధంగా అత్యధికముగా 593మార్కులు సాధించి అనపర్తి మండలం లో సత్తి వెంకటసాయిసుచరణ్ రెడ్డి ప్రధమ స్థానం లో నిలిచారు. ఆర్, సోనియా నవ్యశ్రీ 590మార్కులు సాధించి ద్వితీయ స్థానం లో నిలిచారు. ఎన్, భవిత సాత్విక దేవి ప్రియ 585మార్కులు సాధించి తృతీయ స్థానం లో నిలిచారు.మొత్తం గా చూసుకొంటే 531మార్కులు తో విద్యార్థుల ప్రతిభ ను తెలియచేసారు.

ఆల్ సబ్జెక్టు 100కి 100సాధించిన విద్యార్థులు 13మంది 550మార్కులు సాధించిన విద్యార్థులు 14మంది,2025పదో తరగతి పరీక్ష కు హాజరై న విద్యార్థులు అందరూ నూరు శాతం ఉత్త్తీర్ణత సాధించారు అనపర్తి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు అని,స్కూల్ ప్రిన్సిపాల్ వి ఎన్, రత్నాజీ తెలియచేశారు.ఇంతటి ఘన విజయం సాధించిన శ్రీ చైతన్య విద్యార్థుల అందరూ కి రీజనల్ ఇంచార్జి ఎమ్ వి ఎల్ నరేష్, ఎగ్జిక్యూటివ్ ఏ జి ఎమ్ ఎమ్ వి సురేష్, కో ఆర్డినేటర్ కిరణ్ పాండే,అభినందనలు తెలయచేసారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ వి ఎన్ రత్నజీ, డీన్. వై వి రాజు, స్కూల్ ఉపాధ్యాయ, ఉపాధ్యాయను లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anaparthi Sri Chaitanya Vidyalaya

You cannot copy content of this page