Jai Bhim Yuvajana Sangam : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకే కృషి చేద్దాం

TRINETHRAM NEWS

కుల,మతాలకు అతీతంగా సమానత్వం కై పోరాడుదాం!

త్రినేత్రం న్యూస్. కాకినాడ,డిసెంబర్,06 కాకినాడలో ఎస్. అచ్చుతాపురం లో 47, 48 వార్డులలో జై భీమ్ యువజన సంఘం, అంబేద్కర్ యువజన సంఘంల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, విగ్రహానికి పూలమాల ఆవిష్కరణలు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, 1891 ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్లో మౌ అనే గ్రామంలో రాంజీ సెక్పాల్ బీమా భాయ్ అనే దంపతులకు 14వ సంతనంగా అంబేద్కర్, జన్మించారని, 1856లో డిసెంబర్ 6వ తేదీన తుది శ్వాస విడిచారని ఆయన అన్నారు.

అంబేద్కర్, కీర్తిని తగ్గించి చూపించడానికి దేశాన్ని పాలిస్తున్న అగ్రవర్ణ నాయకులు చేయాల్సిందంతా చేస్తున్నారని, అంబేద్కర్, ఎన్నో కష్టాలు, కన్నీళ్లు పడి భారత రాజ్యాంగ గ్రంధాన్ని రాసి భారతదేశానికి ఒక దిక్సూచిగాచూపించారని, అంబేద్కర్ అంటే సాంఘిక సంక్షేమ హాస్టల్ ,స్కాలర్షిప్లు ఎన్నెన్నో పథకాలకు సృష్టికర్త ఆయనే అని, ఆయన ఆశయ సాధనకే కృషి చేయాలని, అంబేద్కర్, ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం మార్గమని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, దేశాన్ని రక్షించుకోవాలని, భారతదేశంలో 10 శాతం ఉన్న అగ్రవర్ణ స్వార్థ ప్రయోజనాల కోసం దేశ సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కృతిక పరిస్థితులన్నీ తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారని, అందుకే జనగణలో కుల గణన ప్రభుత్వం త్వరగా చేపట్టాలని పంచాయతీ, కార్పొరేషన్ ఎన్నికల్లో లోపు మా వాటా తేల్చాలని, రిజర్వేషన్ స్థానాలు అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు.

కుల,మతాల పోరాటాలు కాకుండా సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం పోరాడదాం అని, వివక్షత లేని సమ సమాజ స్థాపనకై కృషి చేద్దామని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ లక్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక నిధులు కేటాయించాలని కార్పొరేషన్ నిధులతో పట్నాలు, గ్రామాలు అభివృద్ధి చేయాలని, దళితవాడలో కనీసం స్మశాన వాటికి స్థలం లేని గ్రామాల్లో స్థలాలు కేటాయించాలని, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేస్తామన్న గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమిని, అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు భూమిని మంజూరు చేసి ఐదు లక్షల రూపాయల లోన్లు తక్షణమే మంజూరు చేయాలని ఆయన అన్నారు.జరగబోయే పంచాయతీ,కార్పొరేషన్ ఎన్నికల్లో అంబేద్కర్ వారసులు నెగ్గెందుకు ఇప్పటినుంచి సన్నదిద్దాం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కోణాల కృష్ణ, లాయర్ ముఖేష్, జై భీమ్ యువజన సంఘ సభ్యులు టీ అన్నవరం,చిన్ని, శ్రీను, కృష్ణ,బెన్ను, కప్పల రాజు, రాచపల్లి ప్రసాద్, నాగు, దుర్గా, టి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Let us strive to achieve the dream of Dr. B.R. Ambedkar

You cannot copy content of this page

Scroll to Top