Dr. Lakshmanachari : ఎన్నికలలో పోటీ చేసే సర్పంచులు బాలకార్మిక రహిత గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీఇవ్వాలి

TRINETHRAM NEWS

ప్రేరణ బాలలవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణాచారి……….

Trinethram News : గ్రామ పంచాయతీ ఎన్నికలలోపోటీ చేస్తున్న అభ్యర్థులు బాలల హక్కులను కాపాడడంతో పాటు బాలకార్మికత నిర్మూలనకు హామీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రేరణ బాలల వేదిక అధ్యక్షులు ,ప్రముఖ సామాజిక కార్యకర్త , బాలబంధు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారి అన్నారు.బాలల వికాసానికి సంబంధించిన అన్ని వనరులను సమకూర్చి,వారిని ఉత్తమ పౌరులు తీర్చిదిద్దే బాధ్యత సర్పంచులుతీసుకావాలన్నారు.

రాజ్యాంగం కల్పించిన పిల్లల హక్కులను ఎవరు హరించలేరన్నారు. బాలల ఎదుగుదలకు పౌష్టికాహారం, వైద్యం, విద్య అందించి వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందునట్లు ప్రణాళికలు తయారు చేయాలని, దీనిని ప్రజా స్వామ్యయుత మైన కర్తవ్యంగా గ్రామ పంచాయతీలు గుర్తించాలన్నారు. బడికెళ్ళని బాల బాలికల జాబితాను తయారు చేసి వారిని బడికి రప్పించే విధంగా గెలిచిన సర్పంచులు,వార్డు మెంబర్లు ప్రత్యేకశ్రద్ధచూపాలన్నారు .గ్రామంలోని బాలల హక్కులకు రక్షణ కల్పించి,వారి అందమైన బాల్యానికి భరోసా నివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.పోటీచేసే అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్థూ గ్రామ పంచాయతీనీ బాలకార్మిక రహిత గ్రామంగా చేస్తానన్న హామీని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని “ప్రేరణ” “విజ్ఞప్తి చేస్తుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sarpanches contesting elections should promise

You cannot copy content of this page

Scroll to Top