ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
anti-labor policies

కార్మిక హక్కులను కాపాడుకుందాం: తాటిపాక మధు,తోకల ప్రసాద్

Anti-Labor Policies : త్రినేత్రం న్యూస్, కాకినాడ, ఆగస్టు 18: కనీస వేతనం రూ.31 వేలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం కార్మికులు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం, ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, హమాలీ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని కోరారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్, శానిటేషన్, భవన నిర్మాణ, సెక్యూరిటీ, ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ తదితర రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, స్కూల్ ఆయా కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని, పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె. బోడకొండ, ఏఐటీయూసీ నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం, తుని ప్రాంతాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page