ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
AITUC Spearheading militant

-పల్లా దేవేందర్ రెడ్డి. జిల్లా ప్రధాన కార్యదర్శి .

AITUC : డిండి( గుండ్ల పల్లి) జులై 11, త్రినేత్రం న్యూస్. భారతదేశంలో 1920 అక్టోబర్ 31 ఆవిర్భవించిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటియుసి స్వాతంత్రానికి పూర్వమే కార్మిక చట్టం, ఫ్యాక్టరీల చట్టం, పారిశ్రామిక విధానాల చట్టం ,కనీస వేతన చట్టం, సాధించుకోవడం జరిగింది . బ్రిటిష్ వలసవాద సామ్రాజ్యవాదం నుండి విముక్తి చేయుటకు జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో కార్మిక వర్గాన్ని అసంఘటిత చేసి సామ్రాజ స్వతంత్ర సాధనే దేయంగా విరోచిత పోరాటాలు చేసిన గల కార్మిక సంఘం నాడు సామ్రాజ్యం వాద పెట్టుబడిదారుల చేతుల్లో నలిగిపోయిన కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిన అనేక ఉద్యమాల ద్వారా కార్మిక చట్టాలను హక్కులను సాధించిన ఏకైక సంఘం ఏ ఐ టీ యు సి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాల అవుతున్న నేటికీ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికుల ,జీవితాలు మారలేదు కనీస వేతనం లేక పీ ఎఫ్ ఈ ఎస్ ఐ,అమలు నోచుకోక శ్రమదోపిడికి గురవుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంలో ప్రభుత్వం విఫలమైంది. అని కనీస వేతన చట్టాలు సంవత్సరాల తరబడి సవరించకుండా కార్మికులను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడి, ఆశ వర్కర్లు ,మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకెపి, భవన నిర్మాణ రంగా కార్మికులు, ప్రభుత్వ హాస్టల్లో వంట కార్మికులు ,అవుట్సోర్సింగ్ మిషన్ భగీరథ , హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఆటో డ్రైవర్స్ ,ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు, గ్రామపంచాయతీ, స్కామ్ ఎన్జేర్స్ ,కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని కార్మికులపై ప్రభుత్వాలు సమితి తల్లి ప్రేమ చూపుతుందని అన్నారు.
కార్మికుల కోసం నిరంతరం పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న ముఖ్యమైన 44 కార్మిక చట్టాలను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4కోడ్లుగా కుదించి కార్పొరేట్ సంస్థలకు, గుప్తా పెట్టుబడిదారులకు అనుగుణంగా కార్మికులకు నష్టం కలిగించే విధంగా మార్పులు తెస్తుందనీ ఆయన మండిపడ్డారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏ ఐ టీ యు సి జిల్లా అధ్యక్షులు రామస్వామి ,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూమ్ బుచ్చిరెడ్డి ,జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు ,సిపిఐ మండల కార్యదర్శి ఎస్ కనకాచారి ,బుష్పాక లింగమయ్య ,ఎలిమినేటి దేవయ్య ,జవహర్లాల్ , ఎలిమినేటిహుస్సేన్ ,వినయ్ ,వెంకటయ్య ,భుష్పాక సాయిలు, చెన్నయ్య, భారతి తిరుపతయ్య, అలివేలు, లాభాను,గంగమ్మ ,బాలరాజుతదిరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page