తేదీ : 25/05/2025. శ్రీ సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అగలి మండలం, గాయత్రి కాలనీలో చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కొన్ని రోజులుగా ఆ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుత సంచరించడాన్ని పలువురు ప్రజలు గమనించడం జరిగింది. రెండు రోజుల క్రితం చిరుత గొర్రెల మందపై దాడి చేసి వాటిని గాయపరిచింది. రాత్రివేళ సమయంలో చిరుత సంచరించుతుండగా అదే సమయంలో ఆ మార్గాన కారులో వెళ్తున్న ప్రయాణికులు వాళ్ల సెల్ ఫోన్ ద్వారా ఆ దృశ్యాలను చిత్రకరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


