మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి
నివాళులర్పించిన… బహుజనవాది డాక్టర్ యేకుల రాజారావు, మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు బొప్పని నగేష్,
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 18, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, చందంపేట మండలం పోలెపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మాల మహానాడు నాయకులు మరియు వృత్తిరీత్యా మెకానిక్ అయిన పెరుమాళ్ల లక్ష్మయ్య (44) అకాల మరణం చెందారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
వృత్తిరీత్యా మెకానిక్ అయినప్పటికీ, మాల మహానాడు ఆశయాల పట్ల నిబద్ధతతో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. లక్ష్మయ్య మృతి పట్ల మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన మరణం బహుజన ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు.
బుదవారం రోజు ఉదయం లక్ష్మయ్య భౌతికకాయాన్ని హైదరాబాద్ నుండి స్వగ్రామమైన పోలెపల్లికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బహుజనవాది డాక్టర్ యేకుల రాజారావు, మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు బొప్పని నగేష్, జిల్లా నాయకులు శ్యామ్ సుందర్, దేవరకొండ డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్, ప్రధాన కార్యదర్శి మేడ సైదులు, నియోజకవర్గ అధ్యక్షులు బోయిని చంద్రమౌళి, దేవరకొండ మండల అధ్యక్షులు బత్తుల దినకర్ తదితరులు గ్రామానికి చేరుకుని లక్ష్మయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు నారిమల్ల మల్లేష్, బయ్య శ్రీను, నంది వెంకటయ్య, ఎర్ర వెంకటయ్య, గోకమల్ల చెన్నయ్య, చేపూరి మురళి, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు పానుగంటి శ్రీకాంత్, మరియు ఉపాధ్యాయులు నామ వెంకటేశ్వర్లు, నారుమళ్ల ఇద్దయ్య, చేపూరి చెన్నయ్య, జక్క మల్లికార్జున్ తదితరులు పాల్గొని లక్ష్మయ్య సామాజిక సేవలను స్మరించుకున్నారు. ఒక సాధారణ మెకానిక్ కుటుంబం నుండి వచ్చి సమాజం పట్ల బాధ్యతగా మెలిగిన లక్ష్మయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


