వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… ముదిరాజుల పక్షపాతి రేవంత్ రెడ్డి తిరుపతిరెడ్డి వారిపై అసత్య ప్రచారాలు మానుకోవాలి..
రెడ్డి శ్రీనివాస్ మరియు గూళ్ళ నర్సింహులు ముదిరాజ్… కొడంగల్ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ తాలూకా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్, మద్దూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూళ్ళ నర్సింహులు మాట్లాడుతూ, మొన్న మద్దూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ముదిరాజులను మాట ఇచ్చి చైర్మన్ పదవి ఇవ్వలేదు, అని కొందరు అసత్య ప్రచారాలు చేయడం చాలా దారుణం అసలు మద్దూరు మున్సిపాలిటీలో ఎవరిని కూడా చైర్మన్ అభ్యర్థిని తిరుపతన్న రేవంత్ అన్న మండల పార్టీ అధ్యక్షులు ఎవరు ముందుగా ప్రకటించలేదు, గడ్డమీద గోవింద్ అనే వ్యక్తి అధిష్టానం నాకు మాట ఇచ్చింది ఇచ్చి నిలబెట్టుకోలేదని అసత్య ప్రచారాలు చేయడం కరెక్టు కాదు, దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బిఆర్ఎస్ సన్నాసులు కాంగ్రెస్ పార్టీ ముదిరాజులను అణచివేస్తుంది అని చెప్పడం విడ్డూరంగా ఉంది, బిఆర్ఎస్ సమయంలో అత్యంత ఎక్కువగా నష్టపోయింది ముదిరాజులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముదిరాజులకు సముచిత స్థానం ఇస్తూ గౌరవించిన వ్యక్తులు రేవంతన్న తిరుపతన్న ఆ విషయాన్ని మర్చిపోయిన బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే ఈరోజు వచ్చి మద్దూర్లో చిలక పలుకులు పలికితే సమాజం నమ్మడానికి సిద్ధంగాలేరు, బిఆర్ఎస్ సన్యాసులు ఎన్ని రకాలుగా కుట్రలు చేసిన ముదిరాజ్ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుంది, ఈ కార్యక్రమంలో వెంకటయ్య ముదిరాజ్, మల్లయ్య ముదిరాజ్,రాజ్ గోపాల్ ముదిరాజ్,బాలరాజ్ ముదిరాజ్,రమేష్,ప్రకాష్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


