ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
KTR press meet

KTR Press Meet : త్రినేత్రం న్యూస్ : కాళేశ్వరం పంప్‌హౌస్‌ల నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ నీటిని ఎత్తిపోయకపోతే దాదాపు 50 వేల మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

ఒకవైపు రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు, మరోవైపు ఎల్‌నినో ప్రభావం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఇంతటి కరువు పరిస్థితుల్లో కూడా లక్షల క్యూసెక్కుల గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతున్నా, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

రైతుల కోసం ప్రధాన ప్రతిపక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వస్తుంటే తమను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం ప్రజలందరూ చూశారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల సమస్యల కోసం వస్తున్న తమపై ఇంతటి పోలీసు నిర్బంధం ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. “రైతుల కోసం మేము వస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత భయం?” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page