WhatsApp Image 2024 02 10 at 16.12.11
Trinethram News : పల్నాడు జిల్లా
కొండవీడు కోట పర్యాటక అభివృద్ధిలో భాగంగా నిర్వహిస్తున్న కొండవీడు ఫెస్ట్-2024 వీక్షణకు, ప్రవేశ రుసుము లేదని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు కొండవీడు ఫెస్టివల్ 2024 నిర్వహిస్తున్నామన్నారు.
హెలిపాడ్, పారా మోటార్, బోటింగ్ తదితర ప్రత్యేక కార్యక్రమాలతో కొండవీడు ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. అందరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు.
