డిండి (గుండ్లపల్లి)సెప్టెంబర్ 27 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ నవీన్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలిమలి దశ ఉద్యమాలను తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన కులాల వారందరూ ఐక్యమై రాజ్యాధికారం కోసం ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ నవీన్ , వివేక్ సురేష్, పీటర్ ,అజయ్ ,శివాజీ మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


